కోల్‌కతా 20 ఓవర్లలో 194 పరుగులు..

107
kkr

ఐపీఎల్ 2020 టోర్నీలో 42వ మ్యాచ్ జరుగుతోంది. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు 20 ఓవర్లలో..194 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా(81: 53 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌), సునీల్‌ నరైన్‌(64: 32 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీలతో రాణించారు. శుభ్‌మన్‌ గిల్‌(9), రాహుల్‌ త్రిపాఠి(13), దినేశ్‌ కార్తీక్‌(3) విఫలమయ్యారు. ఇయాన్‌ మోర్గాన్‌(17: 9 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు.

ఢిల్లీ స్టార్‌ పేసర్‌ నోర్ట్జే దెబ్బకు కోల్‌కతా కీలక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ బాట పట్టారు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(9)ను ఔట్‌ చేసిన నోర్ట్జే..ఆరో ఓవర్లో రాహుల్‌ త్రిపాఠి(13)ని పెవిలియన్‌ పంపాడు. ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే, రబాడ, స్టాయినీస్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఐపీఎల్‌లో కోల్‌కతా, ఢిల్లీ జట్లు ఇప్పటి వరకు 24 సార్లు ముఖాముఖి తలపడ్డాయి. కేకేఆర్ 13 సార్లు గెలవగా… డీసీ 11 సార్లు విజయం సాధించింది.