కీర్తి.. ‘మిస్ ఇండియా’ ట్రైలర్..

30
Miss India

హీరోయిన్‌ కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కీర్తి ప్రస్తుతం మిస్ ఇండియా’లో నటిస్తోంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మిస్ ఇండియా సినిమాలో కీర్తి గతంలో ఎన్నడూ చేయని ఓ స్పెషల్ రోల్ చేస్తుంది. మొదటి నుంచీ మంచి హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది.

ట్రైలర్‌ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి ఉన్నతమైన కలలు కలిగిన అమ్మాయిగా కనిపించి కీర్తి పాత్ర కనిపిస్తోంది. అంతేకాదు అనుకున్నది సాధించే క్రమంలో ఒడిదుడుకులను ఎదుర్కొనే సాధారణ అమ్మాయిగా కీర్తి పాత్రను డిజైన్ చేశారు. దీనికి తోడు ఈ ట్రైలర్‌లో ఆలోచింపదగ్గ డైలాగులు సీనియర్ నటుడు జగపతి బాబు కు కీర్తికి నడుమ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సారి కీర్తి సురేష్‌కు ఓటీటీలో సాలిడ్ హిట్ దొరికినట్టే అని అనిపిస్తోంది.

Miss India | Official Trailer | Keerthy Suresh | Netflix India