ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో పర్యటించారు ప్రధాని. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మా హయాంలో ఈశాన్య రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయి అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలను మన దేశంలో అంతర్భాగంగా చూడలేదు అని… ఈశాన్య రాష్ట్రాలకు దేశానికి మధ్య దూరం తగ్గింది అన్నారు. అన్ని రాష్ట్రాలను కలుపుకుని దేశాభివృద్ధికి కృషి చేస్తున్నాం అన్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కాంగ్రెస్ మైండ్‌సెట్ నుండి విముక్తం చేయాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. కాంగ్రెస్, అరుణాచల్ ప్రదేశ్‌ను రెండు లోక్‌సభ స్థానాలు మాత్రమే ఉన్నాయని నిర్లక్ష్యం చేసింది. ఈ మైండ్‌సెట్ వల్లే రాష్ట్ర అభివృద్ధి వెనకబడి పోయింది అని ఆరోపించారు.
అరుణాచల్ నుండి త్రిపురకు చేరుకున్న మోదీ, అక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మాత త్రిపుర సుందరి దేవాలయం (మాతాబారి) అభివృద్ధి పనులను ప్రారంభించి..ప్రత్యేక పూజ, దర్శనం చేసుకున్నారు మోదీ.
Also Read:ట్రంప్ ఎఫెక్ట్..ఆగిపోయిన వివాహాలు!

