పామాయిల్ ప్లాంట్..కల సాకారమైంది:హరీష్

16
- Advertisement -

సిద్దిపేటకు పామాయిల్ పంట తీసుకొద్దాం అని ప్రయత్నం చేసిన తొలినాళ్లలో.. 2018 లో ఇక్కడ ఆయిల్ ఫామ్ సాగు ఉండదు అని ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని సందర్శించారు.

గాలిలో తేమశాతం తక్కువ ఉంది ఇక్కడ పామాయిల్ సాగు జరగదు అని తేల్చి చెప్పారు. ..ఆ తర్వాత 2019 లో కాళేశ్వరం ప్రాజెక్టుతో అనంతగిరి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ తోపాటు చెరువులు, చెక్ డ్యాముల్లో నీళ్లు నింపుకున్నాం. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది..2021 లో మళ్ళీ పరిశోధన చేస్తే ఇక్కడ పామాయిల్ సాగు చేసుకోవచ్చు అని ప్రకటించారు. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ పామ్ సాగు అవుతున్నది.
రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరం అన్నారు.

నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయం.. అందరి దృష్టిలో ఇది ఫ్యాక్టరీ కావచ్చు కానీ మన దృష్టిలో ఇది ఒక ఎమోషన్..
వేలాదిమంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే, దశ దిశను మార్చే ఫ్యాక్టరీ ఇది.2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు నర్మెట్ట నుండి ఒక ఫోన్ వచ్చింది.. నా పక్క పొంటి పొలమోడు బోరేస్తున్నడు. ఆ బోరు వేయకుండా ఆపండి అని ఫోన్ వచ్చింది. ఈ ప్రాంతము కరువు ప్రాంతంగా ఉండేది. నంగునూరును కూడా కరువు మండలంగా ప్రకటించారు. ఎక్కడైతే కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తారో అక్కడ తాహసీల్దార్ అనుమతి తీసుకొని బోర్ వెయ్యాలి. ఎవరైనా బోర్ ఏస్తే కలెక్టర్కు చెప్పి బోర్ బండిను ఆపించిన రోజులు ఉండేవి. ఈ రోజు తెలంగాణలో, సిద్దిపేటలో, నంగునూరులో బోరు బండ్లు మాయమైపోయాయి అన్నారు.

కేసీఆర్ చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం అయితేనేమి పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల పథకమైతేనేమి, చెరువులయితేనేమి, చెక్ డ్యాములైతేనేమి ఈ రాష్ట్రం సస్యశ్యామలమై భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి.అశ్వరావుపేట, సత్తుపల్లి సముద్రతీరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కాబట్టి గాలిలో తేమశాతం ఉంటుంది. కాబట్టి అక్కడ మాత్రమే పామాయిల్ పండేది. కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరు గాని, కాళేశ్వరం గాని, సీతారామ గాని వాటి ఫలితంగా తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారింది. ఖమ్మం జిల్లా పర్యటనకు పోయినప్పుడు ఆశ్చర్యపోయాను. అక్కడ ఉండే రైతులు సంపూర్ణమైన రైతులుగా ఉన్నారు. కోతుల బాధ లేదు. చీడ పట్టే బాధ లేదు. ఒక్కసారి పెడితే 30 ఏళ్ల వరకు నెలనెల జీతం పడినట్టు ఆదాయం వస్తుంది. చిన్నకోడూరు మండలంలో కంప్యూటర్ సైన్స్ చదివిన వ్యక్తి నెలకు 60,000 ఐటీ ఉద్యోగం వదిలి పామ్ ఆయిల్ సాగు చేస్తున్నారు. మంచి ఆదాయం ఉంది అని సంతోషం వ్యక్తం చేశాడు. ఐఐఓఆర్, ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ రీసెర్చ్ వారు చెప్పితే తప్ప ఇక్కడ పామాయిల్ సాగు చేయలేమని నాకు చెప్పారు అన్నారు.

2022లో జూన్ 5 నాడు నంగునూరు మండల్ రామచంద్రాపూర్ గ్రామంలో మడుగు ఎల్లారెడ్డి అనే రైతు పొలంలో మొదటి పామాయిల్ మొక్క నాటాను..ఒక్కొక్క రైతును గుర్తించి ఒక్కొక్క ఎకరం పెట్టించి ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను. అందుకే ఏదో భాగోద్వేగం.. అందుకే ఇది మా కల.. చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ వరప్రదాయిని కాబోతున్నది. విత్తనం నాటింది బీఆర్ఎస్… కానీ పండ్లు తినడానికి మాత్రం బయలుదేరింది కాంగ్రెస్ వాళ్లు..ఈ ఫ్యాక్టరీ రావడానికి వెనుక కష్టం ఎవరిది? తంట ఎవరిది? చెమట చుక్కలు చిందించింది ఎవరు అనేది ప్రజలకు తెలుసు.. 2022 ఏప్రిల్ నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీద శంకుస్థాపన చేసింది మన ప్రభుత్వం. పామాయిల్ కు పుట్టినిల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ పెట్టాము. భారతదేశంలో ఏ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి అయినా వంద టన్నుల గెలలు పంపితే 19 టన్నుల ఆయిల్ మాత్రమే వస్తది.. కానీ ఈ ఫ్యాక్టరీలో 100 టన్నుల గెలలకు 20 టన్నుల పామాయిల్ వస్తుంది. ఈ లాభాలు రైతుకే వస్తాయి. గోద్రెజ్, నవభారత్, పతంజలి కంపెనీ వాళ్ళు వచ్చి ఈ టెక్నాలజీని చూసి పోతున్నారు. ఇయాల రేవంత్ రెడ్డి రిబ్బను కత్తిరించడానికి కత్తేర్లు జేబులో పెట్టుకొని బయలుదేరిండు అన్నారు.

Also Read:స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు!

- Advertisement -