PM Modi:హైదరాబాద్‌ షెడ్యూల్ ఇదే

84
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ నెల 8న రాష్ట్రంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారైంది. 8న ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్నారు మోడీ. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. పరేడ్ గ్రౌండ్ చేరుకొని అక్కడ వివిధ ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి తిరుగు పయణం అవుతారు.

ప్రధాని షెడ్యూల్ ఇదే..

()11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

()11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

()11.45 నుంచి 12.00 గంటల వరకు సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

()12.15గంటలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.

()12.18 నుంచి 1.20 గంటల వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

()1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి తిరుగుప్రయాణం అవుతారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -