కరోనా నియంత్రణ..రాష్ట్రాల కృషి భేష్: మోడీ

383
modi
- Advertisement -

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పరిస్థితులను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయటం ప్రశంసనీయ విషయమన్నారు. లాక్ డౌన్ నుంచి బయటపడిన మరుక్షణం జనమంతా మూకుమ్మడిగా బయటకి రావడానికి అవకాశం ఉంది. ఇది జరిగితే మరోసారి కోవిడ్-19 పెంపొందే అవకాశాలు ఉన్నాయి. ఇలా జరగకుండా ఉండటానికి రాష్ట్రాలు, కేంద్రం సంయుక్తంగా ఒక పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలి అన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది.

modi coronavirus video conference

ఇటు వంటి క్లిష్ట సమయంలో ప్రధాని మంత్రి తన నాయకత్వ ప్రతిభ ను చూపారన్న ముఖ్యమంత్రులు. నిజాముద్దీన్ మార్కజ్ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులను పసిగట్టడంతో పాటు కేసుల వ్యాప్తి పెరగకుండా తీసుకున్న చర్యలను ప్రధానికి వివరించారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. కోవిడ్-19 నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోలను, సంక్షేమ సంస్థలను సామాజిక నేతల సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. కోవిడ్-19 నియంత్రణలో సహకరిస్తున్న అందరికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -