రాచకొండ పోలీసులపై డీజీపీ ప్రశంసలు..

267
dgp mahender reddy

రాచకొండ పోలీసులపై ప్రశంసలు గుప్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. హయత్ నగర్ పీఎస్ పరిధిలోని కరోనా కంట్రోల్ రూమ్‌కు సాయం కోసం స్పందించిన క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీ రిక్వెస్ట్‌కు వెంటనే స్పందించారు పోలీసులు. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఆ ఫ్యామిలీకి కావాల్సిన బియ్యం,పప్పు,నూనెతో పాటు కురగాయాలను అందించారు.దీంతో వారిని అభినందించారు డీజీపీ మహేందర్ రెడ్డి.

ఎలాంటి క్లిష్ట పరిస్ధితుల్లోనైనా ప్రజలకు సేవ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు డీజీపీ. కరోనా కాల్స్‌కు స్పందించి వెంటనే సాయం చేస్తున్నారని కొనియాడారు.

కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలని ఇదే అత్యుత్తమ విధానమన్నారు. అవసరాల కోసం ఇంటి నుంచి ఒక్కరే బయటికి రావాలని …లాక్ డౌన్ కొనసాగుతున్నందున అందరూ దీన్ని పాటించాలన్నారు.

rachakonda police