Modi:మోడీ’ నిధుల ‘ డ్రామా!

44
- Advertisement -

చేసేవొకటి.. చెప్పివి మరోటి అన్న రీతిలో సాగుతోంది మోడీ సర్కార్ తీరు. ముఖ్యంగా తెలంగాణ విషయంలో ఈ రకమైన ధోరణి సాగిస్తున్నారు ప్రధాని మోడీ. గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి చేసిందేమి లేకపోయినా.. తెలంగాణకు మేమే దిక్కు, రాష్ట్రానికి ఇది చేశాం అది చేశాం అని కల్లబొల్లి మాటలు చెప్పడం తప్పా వాస్తవానికి ఏం చేయలేదని బీజేపీ నేతలే ఒప్పుకునే పరిస్థితి. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి లెక్కకు మించి నిధులు విడుదల చేశామని, రాష్ట్ర అభివృద్దిలో తమ పాత్ర ఎంతో ఉందని చెప్పుకునే మోడీకి బీజేపీ నేత దేశ ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మల శీతరామన్ చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టులా మారాయి. తెలంగాణకు అసలు నిధులే విడుదల చేయలేదని స్వయంగా ఆమె ఒప్పుకోవడం గమనార్హం.

ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల జరుగుతోందని, ఒక్క తెలంగాణలోనే నిధుల విడుదలను హోల్డ్ లో పెట్టినట్లు నిర్మలా సీతారామన్ ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో ఊహించని విధంగా మోడీ చిక్కుల్లో పడ్డాట్లైంది. ఎందుకంటే ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలను ఆకర్శించేందుకు ఏవేవో చేయనివి కూడా చేసినట్లు చెబుతున్నా మోడీకి ఇప్పుడు నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తుందో ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యాలే నిదర్శనమని రాజకీయ వాదులు చెబుతున్నారు.

రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇస్తున్న కే‌సి‌ఆర్ సర్కార్ ను అడ్డుకునేలా మోటార్లకు మీటర్లు ఉండాలని ఏవోవో చెప్పి తెలంగాణలో జరిగే మంచికి అడ్డుకట్ట వేయాలని చూసిన మోడీకి మోటర్లకు మీటర్లు బిగించే ప్రసక్తే లేదని ప్రజలకు ఉచిత కరెంట్ ఇవ్వడమే ధ్యేయమని ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ తేల్చి చెప్పడంతో తెలంగాణ పట్ల మోడీ సర్కార్ పక్షపాతంగా వ్యవహరిస్తూ దాదాపు రూ.25 వేల కోట్ల నిధులను రాష్ట్రానికి రాకుండా మోడీ సర్కార్ నిలిపివేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం 5 గంటల కరెంట్ కూడా రాని పరిస్థితి. కానీ తెలంగాణలో మాత్రం 24 గంటల ఉచిత కరెంట్ నిర్విరామంగా అమలు అవుతుండడంతో తెలంగాణను చూసి ఓర్వలేక మోడీ నిధులు ఆపుతున్నారనేది స్పష్టంగా అర్థమౌతున్న విషయం.

Also Read:మరో రెండేళ్లు కెప్టెన్ గా రోహిత్ శర్మ?

- Advertisement -