Vishwak Sen:ఆయనకు నేను పెద్ద ఫ్యాన్

50
- Advertisement -

న్యూఏజ్ ఫిలింమేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా ‘మంగళవారం’. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. ఇవాళ మాస్క్ వెనుక ఉన్న నటుడు, మాలచ్చిమ్మ పాత్రలో నటించిన ప్రియదర్శి అని రివీల్ చేశారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ప్రియదర్శికి ఉన్న మాస్క్ విశ్వక్ సేన్ తీశారు.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ ”హీరోయిన్‌ను హీరో చేస్తాడు. రోల్ ఇచ్చి మాస్క్ వేస్తాడు కానీ ముఖం చూపించడు. దర్శకుడ్ని ఐటెం డ్యాన్సర్ చేస్తాడు. నెక్స్ట్ నేను సినిమా చేస్తే అజయ్ భూపతి నన్ను ఏం చేస్తాడో!? జోక్స్ పక్కన పెడితే… అజయ్ భూపతి రెండు రోజులు ముందు ఫోన్ చేస్తే ఫోటోలు పంపించేవాడిని. అప్పటికి తరుణ్ భాస్కర్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆయన కథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. ‘మహాసముద్రం’ కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. డేట్స్ కుదరక అప్పుడు చేయలేదు. లుంగీ కట్టుకుని, కత్తి పట్టుకునే సోకు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో తీరుతుంది. అజయ్ భూపతి నాతో సినిమా చేస్తే మళ్ళీ లుంగీ కట్టుకుని కత్తి పట్టుకోవాలని ఉంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ఇప్పుడీ ‘మంగళవారం’… ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్ తీసుకుని రెండున్నర గంటలు నిజాయతీగా చెప్పే దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్. త్వరలో సినిమా చేద్దాం! పాయల్ బాగా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను ఇంత క్వాలిటీగా తీయాలంటే నిర్మాతలు దొరకడం తక్కువ. నిర్మాతలకు హ్యాట్సాఫ్. ప్రియదర్శి ఏం నక్క తోక తొక్కాడో తెలియదు. సాధారణంగా మంచి సినిమాలు చేస్తే… పేరు వస్తే పైసల్ రావు, పైసల్ వస్తే పేరు రాదు. ప్రియదర్శి చేసే సినిమాలకు పేరు, పైసల్ వస్తున్నాయి. ‘బ్యాట్ మ్యాన్’, ‘డంకర్క్’ సినిమాల్లో టామ్ హార్డీ ఎక్కువ మాస్క్ తో కనిపిస్తారు. తెలుగులో నేను ఆ టైపు రోల్ చేశానని ప్రియదర్శి చెప్పుకోవచ్చు. టీమ్ అందరికీ క్రాంగ్రాచ్యులేషన్స్” అని అన్నారు.

అజయ్ భూపతి మాట్లాడుతూ…నేను ‘ఆర్ఎక్స్ 100’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్న సమయంలో మా బాస్ ఆర్జీవీ గారు ఒక హీరో కావాలని కొన్ని ఫీచర్స్ చెప్పారు. అప్పుడు విశ్వక్ సేన్ గోడమీద కూర్చున్న ‘వెళ్ళిపోమాకే’ స్టిల్ చూశా. తర్వాత లక్ష్మణ్ దగ్గర నంబర్ తీసుకుని ఫోన్ చేసి కొన్ని ఫోటోలు తీసుకున్నా. అప్పటి నుంచి విశ్వక్ సేన్ అంటే తెలుసు. ఇప్పుడు తను మాస్ కా దాస్. మా ఇద్దరి మెంటాలిటీలు ఒక్కటే. అందుకని, అతను అంటే ఎక్కువ ఇష్టం. పిలిచిన వెంటనే వచ్చిన ఆయనకు థాంక్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన వచ్చారు. లేడీస్ చాలా మంది సినిమా గురించి ఆర్టికల్స్ రాస్తూ సోషల్ మీడియాలో నన్ను ట్యాగ్ చేస్తున్నారు. ఎవరూ ట్రై చేయనిది చేశానని, టేకింగ్ నెక్స్ట్ లెవల్ అని చెబుతున్నారు. హ్యాపీ! అన్నిటికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యింది ఏమిటంటే… పాయల్ క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకుంటారా? రిసీవ్ చేసుకుంటారా? అని మొదట్లో కొంచెం భయపడ్డా. అయితే ప్రేక్షకుల్ని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు చాలా అప్డేట్ అయ్యి ఉన్నారని మరొక్కసారి నిరూపితం అయ్యింది. పాయల్ క్యారెక్టర్ డీల్ చేసిన విధానం, పాయల్ నటన, నేపథ్య సంగీతం బావుందని అంటున్నారు. మహిళలు అందరూ వెళ్లి చూడాల్సిన సినిమా ‘మంగళవారం’ అని చెబుతున్నారు. ఇది నిజంగా హ్యాపీగా ఉంది. నాకు హెల్ప్ చేసిన టెక్నీషియన్లు అందరికీ థాంక్స్. సినిమాలో రాసిన క్యారెక్టర్లు అన్నిటి కంటే ప్రియదర్శి చేసిన మాలచ్చిమి క్యారెక్టర్ నాకు ఇష్టం. ప్రతి ఆర్టిస్ట్ తెరపై తన ఫేస్ కనిపించాలని కోరుకుంటారు. ప్రియదర్శి చేసిన క్యారెక్టర్ 80 శాతం ఫేస్ కనిపించదు. కానీ, ఆ పాత్రలో గాఢత అర్థం చేసుకుని ప్రియదర్శి చేశాడు. అతనికి థాంక్స్. పాయల్ చేసిన క్యారెక్టర్ మరొక హీరోయిన్ చేయలేదని చెబుతున్నారు. గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరని కూడా చెబుతున్నారు. ఆర్టిస్టులు అందరికీ థాంక్స్. మా నిర్మాతలు స్వాతి గారు, సురేష్ వర్మ గారు లేకపోతే నేను ఇంత క్వాలిటీ సినిమా చేసేవాడిని కాదు. ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో శంకర్ అండ్ నవీన్ గారు మంచి రిలీజ్ చేశారు. నైజాం దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేశారు” అని అన్నారు.

Also Read:మరో రెండేళ్లు కెప్టెన్ గా రోహిత్ శర్మ?

- Advertisement -