26న రాష్ట్రానికి ప్రధాని మోడీ..

89
modi
- Advertisement -

ఈ నెల 26న తెలంగాణకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ . ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్బీ) వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు బీజేపీ నేతలు సిద్దమవుతున్నారు.

పార్టీ కార్యక్రమంలో మోడీ పాల్గొనే విధంగా పీఎంవో ను బీజేపీ రాష్ట్ర శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే సమాచారం పంపారు.

20 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ ముఖ్యనేతల రాకతో రాష్ట్ర బీజేపీలో కొత్త జోష్‌ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర పార్టీ కసరత్తు మొదలుపెట్టింది.

- Advertisement -