IIT Kharagpur:75 ఏళ్ల వేడుకల్లో ప్రధాని

2
ఖరగ్ పూర్ ఐఐటీ
- Advertisement -

భారతదేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో మార్పులు తీసుకురావడంలో ఐఐటీ ఖరగ్‌పూర్ కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత 75 ఏళ్లుగా దేశ ప్రగతికి ఈ విద్యాసంస్థ అందించిన సేవలు ఎంతో విలువైనవని ప్రశంసించారు. దేశంలోనే మొట్టమొదటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)గా గుర్తింపు పొందిన ఖరగ్‌పూర్ సంస్థ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని నేతాజీ ఆడిటోరియంలో ‘వికసిత్ భారత్ కోసం 75 వాయిసెస్’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత 75 సంవత్సరాలుగా దేశ రూపాంతరంలో ఐఐటీ ఖరగ్‌పూర్ గణనీయమైన పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ సంస్థ నుంచి విద్యనభ్యసించిన ఎందరో ప్రతిభావంతులు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఐఐటీలు అందిస్తున్న సహకారం దేశ పురోగతికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా చర్చించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత, విద్యార్థుల భాగస్వామ్యం కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు.

ALso Read:హనుమాన్ అన్ష్‌ హిట్ కానీ..దర్శకుడు మాత్రం!

ఐఐటీ ఖరగ్‌పూర్ 1951లో స్థాపించబడింది. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో ఈ విద్యాసంస్థ ఉంది. దేశంలో ఏర్పాటు చేసిన తొలి ఐఐటీగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏడు దశాబ్దాలకు పైగా విద్య, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణల్లో ఈ సంస్థ విశేష సేవలందిస్తోంది. ఈ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, గవర్నర్ ఆర్.ఎన్. రవి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ తదితరులు పాల్గొన్నారు. 75 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఐఐటీ ఖరగ్‌పూర్ భవిష్యత్తులోనూ దేశ సాంకేతిక అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధాని ఆకాంక్షించారు.

- Advertisement -