ఉగ్రవాదాన్ని యుద్ధ వ్యూహాంగా వాడుతున్న పాకిస్తాన్‌కు సరైన బుద్ది చెబుతామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన గుజరాత్ అర్బన్ గ్రోత్ స్టోరీ 20వ సంబరాల్లో పాల్గొన్నారు ప్రధాని.
ఈ సందర్భంగా మాట్లాడుతూ…ఉగ్రవాదుల మృతదేహాలపై పాకిస్థాన్ జాతీయ జెండాలను పరిచిందని, వాళ్లకు పాక్ మిలిటరీ కూడా సెల్యూట్ చేసిందని చెప్పారు.
ఉగ్రవాద చర్యలను పరోక్ష యుద్ధంగా పరిగణించరాదు అని, ఇది కావాలని చేస్తున్న యుద్ధ వ్యూహాంగా భావించాల్సి వస్తుందని, ఒకవేళ వాళ్లు యుద్ధానికి దిగిగే, అప్పుడు మన సమాధానం కూడా ఆ రేంజ్‌లోనే ఉంటుందని తెలిపారు.
దేశ విభజన సమయంలోనే ముజాయిదీన్‌లు ఏర్పడ్డారని, వాళ్లను అప్పుడే ఖతం చేస్తే ఈ సమస్య ఉండేది కాదు అని ప్రధాని పేర్కొన్నారు. కశ్మీర్‌లోకి ప్రవేశించిన ముజాయిదీన్‌లను 1947లోనే అంతం చేస్తే,ఇప్పుడు ఈ సమస్య ఉత్పన్నం అయ్యేది కాదన్నారు. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసి, మన డ్యాముల్లో నీటి సామర్థ్యాన్ని పెంచుతుంటే, పాకిస్థానీలు ఆగ్రహానికి గురవుతున్నారని తెలిపారు. ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్‌ను దాటేసినప్పుడు సంతోషంగా ఫీలయ్యామని, ఎందుకంటే ఆ దేశం మనల్ని పాలించిందని, ఎప్పుడు 3వ స్థానానికి వెళ్లాలన్న వత్తిడి ఇప్పుడు దేశంపై ఉందన్నారు.
Also Read:బెల్లంతో లాభాలు ఎన్నో!

