- Advertisement -
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాల నేతలు బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బైడెన్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొని, ప్రపంచ శాంతి, భద్రతల సాధనకు కలసికట్టుగా పనిచేద్దామన్నారు. బైడెన్ తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు సరికొత్త ఎత్తులకు చేరేలా బైడెన్‌తో కలిసి పనిచేస్తానని అన్నారు. నమ్మకం ఆధారంగా భారత్-అమెరికా భాగస్వామ్యం కొనసాగుతుందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
- Advertisement -