- Advertisement -
ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ‘పంజాబ్ ఎన్నికల్లో గెలిచినందుకు ఆప్ పార్టీకి అభినందనలు. పంజాబ్ అభివృద్ధికి కోసం కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌పై స్పందించిన ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి ‘ధన్యవాదాలు సర్’ తెలిపారు. ఆప్ పంజాబ్‌లో 117 స్థానాలకు గాను రికార్డు స్థాయిలో 92 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో ఏ పార్టీలో పొత్తు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
- Advertisement -