సీఎం రేవంత్‌కు ప్రధాని విషెస్

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన మోడీ..ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ప్రధాని మోదీ పోస్టుకు సీఎం రేవంత్‌ స్పందించారు. మీ విషెస్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రిగా తొలి పుట్టినరోజును జరుపుకుంటున్న రేవంత్‌ రెడ్డి …యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో మాట్లాడుతారు. మూసీ పునరుజ్జీవ యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు.

Also Read:TTD:పుష్పయాగంకు అకురార్పణ

- Advertisement -