విపక్ష కూటమిపై ప్రధాని సెటైర్

34
- Advertisement -

విపక్ష కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనదైన శైలీలో సెటైర్ వేశారు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా విపక్షాలు తమ కూటమికి ఇండియాగా పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియా అంటే ఇండియ‌న్ నేష‌న‌ల్ డెవ‌ల‌ప్మెంట‌ల్ ఇన్‌క్లూజివ్ అలియ‌న్స్.

దీనిపై ప్రధాని తనదైన శైలీలో సెటైర్ వేశారు. ఇండియ‌న్ ముజాహిద్దిన్‌, పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థ‌ల్లోనూ ఇండియా పేరు ఉంద‌ని ఎద్దేవా చేశారు.ఇంత‌గా దిశ‌లేని విప‌క్షాన్ని ఎప్పుడూ చూడ‌లేద‌న్నారు.

Also Read:Pawan:ఓజి రిలీజ్ డేట్ ఛేంజ్‌!

ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌, ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి పార్టీల‌ను కూడా విదేశీయులు ప్రారంభించారన్నారు. దేశం పేరును వాడుకుని ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించ‌లేర‌ని….ఓడిపోయి, అల‌సిపోయి, ఆశ‌లేని పార్టీలుగా విప‌క్షాలు మిగిలిపోయాయని వెల్లడించారు.

Also Read:కేర్ ఫుల్: పుట్టగొడుగులు తింటున్నారా..!

- Advertisement -