- Advertisement -
శవ్యాప్తంగా టీకాల కొరతతో ఇప్పటివరకు 45 ఏళ్లు పై బడిన వారికి, సెకండ్ డోస్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తూ టీకాలు ఇస్తున్నారు. అయితే టీకా వృధాను తగ్గించేలా కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ.
వ్యాక్సిన్ల వ్యర్థాన్ని తగ్గించడంలో మన ముందు ఉదాహరణగా నిలిచిన కేరళ ఆరోగ్య కార్యకర్తలు, నర్సుల కృషిని చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు.
కరోనాకు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటానికి ఇది అవసరం అని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను మోదీ కొనియాడారు.
వ్యాక్సిన్ వృధాలను తగ్గించడంలో కేరళ ప్రభుత్వం ఘణనీయంగా కృషి చేయడం వల్లనే అందరికీ డోసులు అందుతున్నాయని మోదీ చెప్పారు. కొవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడంలో ఇది ముఖ్యమని అన్నారు.
- Advertisement -