- Advertisement -
తొలి విడత ఎన్నికల సమరం ప్రారంభమైంది. 102 లోక్ సభ స్థానాల్లో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోండగా సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
ఫస్ట్ ఫేజ్ పోలింగ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రతి ఓటు లెక్కించబడుతుందని, ప్రతి గొంతుక ముఖ్యమైనదని అన్నారు.
85 సంవత్సరాల పైబడిన వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. తొలి దశలో మొత్తం 16.63 కోట్ల మంది ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలపై పటిష్ట నిఘా వేసింది ఈసీ.
Also Read:కాంగ్రెస్ లో మంటపెట్టిన రేవంత్!
- Advertisement -