ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి టూర్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. మే 2న ప్రధాని అమరావతిలో పర్యటించనుండగా రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మే 2వ తేదీన మధ్యాహ్నం 3గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.1కిలో మీటరు మేర 15 నిమిషాలపాటు రోడ్ షోలో పాల్గొంటారు.
3.45గంటలకు అమరావతి పెవిలియన్ ను సందర్శిస్తారు. సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు అమరావతి రాజధాని నిర్మాణ పనులు పున: ప్రారంభంతోపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు అమరావతి ప్రాంతం నుంచి తిరిగి పయణమవుతారు. సాయంత్రం 5.10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. గన్నవరం నుంచి బయల్దేరి 5.20గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు.
Also Read:కోదండ రామస్వామి ఆలయంలో పుష్పయాగం

