భారతీయులకు గర్వకారణం: మోదీ

160
modi
- Advertisement -

ఇండియాలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చేసింది. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ష‌ర‌తులతో కూడిన‌ అనుమ‌తి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ..డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ద్వారా ఆమోదం పొందిన రెండు కొవిడ్‌ వ్యాక్సిన్లు భారత్‌లో తయారవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు.

అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన రెండు వ్యాక్సిన్లు భారతదేశంలో తయారు చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన పని చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, కరోనా యోధులందరికీ మేం కృతజ్ఞులం అంటూ ట్వీట్‌ చేశారు.

- Advertisement -