భారత్ బయోటెక్ పై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

155
- Advertisement -

ఇండియాలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వ‌చ్చేసింది. సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేస్తున్న కొవిషీల్డ్‌తోపాటు హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా ష‌ర‌తులతో కూడిన‌ అనుమ‌తి ఇచ్చింది.

ఈ నేపథ్యంలో స్పందించిన మంత్రి కేటీఆర్…వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్‌ విరాజిల్లుతోందన్నారు. హైదరాబాద్‌ భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను దేశంలో అత్యవసర పరిస్థితుల్లో వినియోగానికి అనుమతి ఇవ్వడంపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్లకు అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తల కృషితో హైదరాబాద్‌కు ఎంతో ఖ్యాతి లభిస్తుందన్నారు.

- Advertisement -