బ్రెజిల్ విధ్వంసంపై ప్రధాని మోడీ..

24
- Advertisement -

బ్రెజిల్‌లో ఆందోళనలపై స్పందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బ్రసిలియాలోని ప్రభుత్వ వ్యవస్థలపై చేసిన దాడి గురించి తెలుసుకుని ఆందోళన చెందాను. ప్రజాస్వామ్య సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి. బ్రెజిల్ అధికారులకు మేము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం అని తెలిపారు.

బ్రెజిల్ లో 2022లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బోల్సొనారో ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం లులా డా సిల్వా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో అప్పటినుండి బోల్సొనారో మద్దతుదారులు నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తునే ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని విధ్వంసానికి పాల్పడి బీభత్సం సృష్టించారు.

బ్రెజిల్ లో చోటుచేసుకున్న ఘటనలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఖండించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -