పీఎం మిత్ర ..తెలంగాణలో మెగా టెక్స్‌టైల్స్‌

35
- Advertisement -

దేశంలో అతి పురాతనమైన చేనేత రంగం అదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర (PM-MITRA)(PM Mega Integrated Textile Region and Apparel)ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేశారు. వాటిలో తెలంగాణ కూడా ఉంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని ఐదు ప్రాంతాల్లో ఈ పథకంను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో నవకల్పనల కోసం 5F (Farm to Fibre to Factory to Fashion to Foreign)ప్రారంభించనున్నారు. సూమారు రూ.70వేల కోట్ల పెట్టుబడులతో దాదాపుగా 20లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ఈ పథకంను ప్రారంభించినట్టు ప్రకటించారు.

తమిళనాడులోని విరుదూనగర్, తెలంగాణలోని వరంగల్, కర్ణాటకలోని కలబురిగి, మహారాష్ట్రలోని అమరావతి, గుజరాత్‌లోని నవశ్రీ, మధ్యప్రదేశ్‌లోని దార్, ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ప్రాంతాలను తొలుత ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం మొదటగా క్యాపిటల్ సపోర్ట్‌ కింద రూ.500కోట్లు, కాంపిటెటివ్‌ ఇన్‌సెన్టివ్స్ సపోర్ట్ కింద రూ.300కోట్లను కేంద్రం ప్రభుత్వం సమాకూర్చనున్నట్టు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి…

ఐ యామ్‌ బ్యాక్‌: ట్రంప్‌

శవాసనం వేస్తే ఎమౌతుందో తెలుసా !

పట్టాభిషేక సంవత్సరం.. కోహినూర్‌ ప్రదర్శన

- Advertisement -