ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లో ₹2,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 24వ తేదీన బిహార్‌లో పర్యటించనున్నారు.
()రైతులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి నివాసితులుగా ఉండాలి.
()5 ఎకరాల కంటే తక్కువ భూమిని కలిగి ఉన్న రైతులు ఇందుకు అర్హులు
()సన్న, చిన్న రైతులు మాత్రమే అర్హులు.
అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/లోకి వెళ్లి లబ్దిదారుల జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రం, జిల్లా, మండలం,గ్రామం వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది.
Also Read:కేబినెట్ విస్తరణ.. ముహుర్తం ఖరారు!
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.inలోకి వెళ్లాలి
స్కీన్‌పై కనిపించే ఆప్షన్లలో స్టేటస్ లింక్ పై క్లిక్ చేయాలి.
మీకు అక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ ఐడీ ద్వారా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు అందించి గేట్ డేటాపై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలు కనిపిస్తాయి.