నీరుగారిపోతున్న కిసాన్‌ నిధి…

184
- Advertisement -

2019 నుంచి భారత ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి యోజన తీసుకువచ్చింది. కానీ ఆది నుంచి దీన్ని నీరు గారుస్తూ రైతుల నడ్డి విరుస్తోన్న తీరును ప్రముఖ సామాజిక కార్యకర్త కన్హయ్య కుమార్‌ ఆర్టీఐ చట్టం ద్వారా వేసిన పిటిషన్ ద్వారా స్వయంగా కేంద్ర ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది. ఈ నివేదికల ప్రకారం దేశంలోని రైతులు 2019 నాటికి 11.84కోట్ల రైతుల నుంచి 2022వ సంవత్సరం 11వ వాయిదా వచ్చేనాటికి కేవలం దేశంలో 3.87కోట్ల రైతులకు లబ్ధి చేకూరుతుంది. అంటే మొత్తంగా 67శాతం రైతులకు కేంద్ర ప్రభుత్వం నిధులను కోత విధించింది.

అత్యధికంగా మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీగా కోతలు విధించారు. ప్రతి సంవత్సరం రూ.6వేల చొప్పున రైతుల ఖాతాలో నేరుగా జమచేయాల్సిన సొమ్మును భారత ప్రభుత్వం భారీగా తగ్గించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ కోతలు విధించిన తీరును చూస్తే భారత ఆర్థిక వ్యవస్థ ఎంతలా దిగజారిపోయిందో ఆర్ధమవుతుంది.

కేంద్ర ప్రభుత్వం 12వ వాయిదాల ద్వారా రైతులకు రూ.2.16లక్ష కోట్లను విడుదల చేసామని ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి…

రేటును అమాంతం తగ్గించేసింది.. మరీ పిలుస్తారా ?

గ్రీన్ టీతో ఉపయోగాలు..

నేను ఫెయిల్..తమ్ముడు పాస్‌!

- Advertisement -