రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రతీయేటా కేంద్రం అందించే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు ఇవాళ రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. మూడు విడతల్లో ఒక్కో విడతకు రూ.2వేలు చొప్పున ఏడాదికి రూ.6వేలు కేంద్రం అందిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 10 విడతలుగా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసింది..
ఇవాళ 11వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. రూ.21,000 కోట్లను అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం జమచేయనుంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ కార్యక్రమం ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళనలో తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 16 పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. అనంతరం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను విడుదల చేయనున్నారు.