- Advertisement -
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద 19వ విడత నిధులను విడుదల చేశారు. బీహార్ రాష్ట్రంలోని భాగల్‌పూర్ లో జరిగిన సమావేశంలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు ప్రధాని.
ఈ ఏడాది ఆఖరులో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల విడుదలకు బీహార్‌ను వేదికగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రధాని విడుదల చేసిన పీఎం కిసాన్ నిధులతో దేశవ్యాప్తంగా 9.8 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. 19వ విడత పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రధాని మొత్తం రూ.22,700 కోట్ల నిధులను విడుదల చేశారు.
Also Read:హైదరాబాద్‌లో AMGEN ఇన్నోవేషన్ సైట్
- Advertisement -