పీఎం కిసాన్‌..డేట్ ఫిక్స్!

6
- Advertisement -

రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను వెల్లడించింది. ఈ నెల 19న పీఎం-కిసాన్ 21వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేయనుంది.

పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.3 లక్షల 70 వేల కోట్లు జమ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతులకు లబ్ది చేకూరింది. అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రతి ఏడాది కేంద్ర సర్కారు విడతలవారీగా రూ.6 వేల చొప్పున జమచేస్తోంది.

ఈ పథకంలో భాగంగా 25 శాతం ప్రయోజనాలను మహిళా రైతులకు కేటాయిస్తుంది. ఆధార్ బేస్డ్‌ ఈ-కేవైసీ (ఆధార్ ఆధారిత గుర్తింపు ధ్రువీకరణ- వన్‌టైమ్‌ పాస్‌వర్డ్, బయోమెట్రిక్, ముఖ గుర్తింపు ద్వారా పూర్తి చేసే ప్రక్రియ) ద్వారా లబ్ధిదారులకు ఎంతో మేలు జరిగింది.

పీఎం-కిసాన్ మొబైల్ యాప్ (రైతులు సేవలు పొందే అధికారిక యాప్), నూతన పోర్టల్ ఫీచర్లు ‘నో యువర్ స్టేటస్’ , ఇంటి వద్ద నుంచే ఆధార్ లింక్, బ్యాంకింగ్ సేవలురైతులకు మరింత అనుకూలంగా మారాయి.

Also Read:తిమ్మక్క మరణం బాధ కలిగించింది!

- Advertisement -