రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. మధ్యాహ్నం నుండే చల్లటి గాలులు వీస్తుండగా ఉదయం వేళలో పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలుఉ నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యల్పంగా కోహిర్‌లో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రత 9.1 డిగ్రీలుగా నమోదైంది. గ్రామాల ప్రజలు చలి మంటలతో సేద తీరుతున్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.
రానున్న రెండు, మూడు రోజులు రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండే ఛాన్స్ ఉందని అధికారులు చెప్పారు. కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలి గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read:తిమ్మక్క మరణం బాధ కలిగించింది!

