కరోనా సమయంలో ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్ కేంద్ర ప్రభుత్వం కిందకు రాదని అది కేవలం పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా ఉంటుందని దిల్లీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ తప్పు పట్టారు. ప్రభుత్వ చిహ్నం ప్రభుత్వ వెబ్సైట్‌ని వినియోగిస్తూనే పీఎం కేర్స్ ప్రభుత్వ సంస్థ కాదని చెబుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
పీఎం కేర్స్ నిధిని ప్రభుత్వ నిధిగా ప్రకటించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్ట్‌లో సంయక్ గంగ్వాల్ అనే ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ అది ప్రభుత్వ నిధి కాకుంటే వెబ్‌సైట్ డొమైన్ పేరులో గవ్. ప్రధానమంత్రి ఫోటో కేంద్ర ప్రభుత్వ ముద్రను తొలగించాలని కోర్టుకు తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ ద్వారా వివరణ ఇచ్చింది. ఇది ప్రభుత్వ నిధి కాదు. పీఎం కేర్స్ కింద సేకరించిన విరాళాలు భారత ఏకీకృత నిధి కి వెళ్లవని స్పష్టం చేశారు. ఇతర ట్రస్టుల మాదిరిగానే ఈ ట్రస్టుకు వచ్చిన మొత్తంను పూర్తిగా పారదర్శకంగానే వినియోగిస్తున్నామని తెలిపారు. దీంతో పాటుగా ఈ ట్రస్టు భారత రాజ్యంగం పార్లమెంట్ ఏదైనా రాష్ట్ర శాసనసభ చేసిన చట్టం ద్వారా పీఎం కేర్స్ ఫండ్ సృష్టించలేదని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు వివరణ ఇచ్చింది.
Classic case of blatant abuse of Govt machinery by NPA
Using Govt emblem, PMO, and Govt website, still claiming it's not a Govt entity! https://t.co/pJVbHshBGS
— KTR (@KTRBRS) February 1, 2023
ఇవి కూడా చదవండి…