‘ఐశ్వర్య రాయ్’కి ప్లాస్టిక్ సర్జరీ

16
- Advertisement -

మాజీ ప్రపంచ సుందరిగా.. విశ్వసుందరిగా ‘ఐశ్వర్య రాయ్’కి ఉన్న ఇమేజ్ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. ఐతే, తాజాగా ఐశ్వర్య రాయ్ పై ఓ రూమర్ గట్టిగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మాజీ ప్రపంచ సుందరికి 50 సంవత్సరాలు. సహజంగా వయసు పెరుగుతూ పోతున్న క్రమంలో అందం తరుగుతూ ఉంటుంది. శరీరంలోని ఆకర్షణీయమైన అందాల బిగువులు సడలుతూ ఉంటాయి. వాటి పట్టును కోల్పోతూ ఉంటాయి. అయితే, ఈ మార్పులను హీరోయిన్లు పెద్దగా ఇష్టపడరు. ఐశ్వర్య రాయ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.

ఈ క్రమంలోనే ఐశ్వర్య రాయ్ కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. లేటు వయసులో కూడా అందంగా కనపడేందుకు ఐశ్వర్య రాయ్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. రీసెంట్‌గా ఐశ్వర్య రాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. ఆమెలో మునపటి అందం లేదు అంటూ కామెంట్స్ వినిపించాయి. బహుశా ఈ కామెంట్స్ కారణంగానే ఐశ్వర్య రాయ్ తన అందం పై ఫోకస్ పెట్టినట్టు ఉంది. దీంతో ఐశ్వర్య రాయ్ సర్జరీ చేయించుకుంటుందా ? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

దీనికితోడు, ఐశ్వర్య రాయ్ ఈ మధ్య బాగా బోల్డ్ గా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా.. విచ్చలవిడిగా రెచ్చిపోతుంది. ఐతే, ఆమె అభిమానులు మాత్రం ఈ వయసులో ఇలాంటి నిర్ణయం మంచిది కాదు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. 1994వ సంవత్సరంలోనే విశ్వసుందరిగా ఐశ్వర్య రాయ్ ఎంపిక అయ్యింది. పైగా ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు కొత్తగా ఎవరిని మెప్పిద్దాం అని ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు నెటిజన్లు.

Also Read:‘ఛలో మేడిగడ్డ’.. లెక్క తేల్చుతాం!

- Advertisement -