రాష్ట్రంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, అమ్మకాలను షేధించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. దీనిపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చదిద్దేందుకు ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్నట్టు ప్రగతి భవన్‌లో జరిగిన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న ప్లాస్టిక్‌ను నిషేదించాలని, మానవాళికి విఘాతంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుందని తెలిపారు.
దీనికి అవసరమైన విధివిధానాలను ఖరారు చేయాలని ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద దీన్ని అమలుచేయాలని సూచించారు సీఎం కేసీఆర్. ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ కేబినెట్ భేటీలో ఉత్తర్వులు జారీచేయనున్నట్టు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ప్లాస్టిక్ నిషేధంపై నిర్ణయం తీసుకోవడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
Hon’ble CM decided that single use plastic will be banned in Telangana. Next cabinet will resolve to implement across all municipalities and villages
I invite suggestions for effective implementation from environmentally conscious citizens 🙏 https://t.co/Cfpmsp6Oum
— KTR (@KTRTRS) October 10, 2019