పేదలకు మంచి వైద్యం అందించడమే లక్ష్యం..

427
etela rajendar
- Advertisement -

న్యూఢిల్లీలో 13 వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు పాల్గొన్నారు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు పేదలకు మంచి వైద్యం అందించాలన్న లక్ష్యంతో సమావేశం జరిగింది.

2014లోనే రక్త హీనతతో బాధ పడుతున్న వారికి కోసం అంగన్ వాడీ కేంద్రాల్లో మహిళలు, పిల్లలకు 15 గుడ్ల నుంచి 30 గుడ్లకు పెంచామని మంత్రి అన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలన్న లక్ష్యంతో కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు.నీళ్లతో వచ్చే రోగాల నిర్మూలనకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేలా పథకం తీసుకొచ్చిన రాష్ట్రం తెలంగాణ. పేద గర్భిణిలకు ఆర్థిక సహకారం ఇచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో పురుడు పోసిన తర్వాత కేసీఆర్ కిట్ ఇస్తున్నామన్నారు.

కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణలో కేవలం 24 లక్షల మందే అర్హులు అయ్యారు.కానీ ఆరోగ్య శ్రీ కింద రాష్ట్రంలోని పేదలందరికి కార్పొరేట్ వైద్యం కూడా తెలంగాణ అందిస్తోంది.గుండె, కాలేయం మార్పిడి వంటి వాటికి కూడా 13 లక్షల రూపాయలు చెల్లించి చేపిస్తోంది.

– ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సమస్య ఉంటది. ఆయా రాష్ట్రాలు వాళ్ల సమస్యలకు అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటే కేంద్రం సహకరిస్తే బాగుంటుందని కేంద్రానికి సూచించాం. అభివృద్ధి పథంలో ఉన్న రాష్ట్రాలు అవలంభిస్తున్న ప్రణాళికలకు తోడ్పాటు అందిస్తే ఆ రాష్ట్రాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పాం. ఒక్కో మెడికల్ కాలేజ్ లో 500 నుంచి 600 పడకలు ఉంటాయి.

తెలంగాణ లో 24 మెడికల్ కాలేజీల్లో 15 వేల పడకలు ఉన్నాయి.వాటిని ప్రభుత్వ ఆస్పత్రులకు అనుసంధానం చేస్తే ఎక్కువ మందికి మంచి వైద్యం అందుతుంది.ఆరోగ్య సూచిలో ముందున్న కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు దీటుగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి ఈటెల తెలిపారు.

- Advertisement -