వేయి స్ధంబాల గుడిని అభివృద్ది చేస్తాంః వినోద్ కుమార్

427
vinod kumar
- Advertisement -

వరంగల్ నగరంలోని వేయి స్ధంబాల గుడిని అభివృద్ది చేస్తామన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. నేడు వేయి స్తంభాల దేవాలయంను సందర్శించి, గుడి నిర్మాణ పనులను పరిశీలించారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, జడ్పీ చైర్మన్ సుదీర్ కుమార్, మేయర్ గుండా ప్రకాష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, కలెక్టర్ హరిత, పురవస్తుశాఖ అధికారులు.

ఈసందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలో కాకతీయుల కట్టడాలు మహా అద్భుతమైనవన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి ఈగుడిని అభివృద్ది చేస్తాం. శిధిలావస్ధలో ఉన్న కాకతీయుల నిర్మాణాలను పునరుద్దీకరించడానికి 2006లో వేయి స్దంబాల గుడి కళ్యాణ మండపాన్ని డిస్మెండల్ చేశారు. ఇప్పటి వరకు 70శాతం పనులు పూర్యయ్యాయి. రేపటి నుంచి నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది వరకు పనులను పూర్తి చేస్తామని చెప్పారు.

- Advertisement -