ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తా నుంచి బయల్దేరిన విమానం కొద్దిసేపటికే సముద్రంలో కుప్పకూలింది. లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పంగకల్ పిన్నాంగ్‌కు వెళ్లాల్సి ఉంది. జకార్తలో టేకాఫ్ అయిన 13 నిమిషాలకే విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి కొద్ది దూరంలోనే ఈ విమానం కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
విమానంలో 188 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమాన శిథిలాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు.
విమానంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అనేది మేం ఇప్పుడే చెప్పలేం. కానీ సాధ్యమైనంతవరకు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేస్తాం అని అధికారులు తెలిపారు.విమాన శకలాల వద్దకు సహాయ బృందాలు చేరుకున్న దృశ్యాలను ఓ నేవీ అధికారి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.
Serpihan pesawat Lion Air JT 610 yang jatuh di Perairan Karawang banyak ditemukan mengapung di permukaan laut. Kapal USV Fulmar menemukan serpihan berupa pelampung, HP dan lainnya. Basarnas dibantu Kementerian Perhubungan, TNI, Polri & relawan terus lakulan evakuasi. pic.twitter.com/A4wjeoE5tl
— Sutopo Purwo Nugroho (@Sutopo_PN) October 29, 2018