సవ్యసాచి “వై నాట్ ” సాంగ్..

273
- Advertisement -

చందు మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య “సవ్యసాచి” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మాధవన్, భుమిక, రావు రమేష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను విడుదల చేయగా.. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. “ప్రేమమ్” చిత్రం అనంతరం చందూ మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక నవంబర్ 2న మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు రాని ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా రిలీజైన వై నాట్ అనే సాంగ్ కూడా అభిమానులను అలరిస్తోంది.

- Advertisement -