‘పిజ్జా3’…డిఫరెంట్ మూవీ

57
- Advertisement -

మోస్ట్ పాపులర్, సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘పిజ్జా’. ఈ ఫ్రాంచైజీ లో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని, భారీ విజయాలు సాధించి, ప్రత్యేక ఫ్యాన్ భేస్ ని సంపాదించుకున్నాయి. ఇప్పుడు ‘పిజ్జా3’ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటివలే తమిళంలో విడుదలైన ‘పిజ్జా3’ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు ప్రధాన పాత్రలలో మోహన్ గోవింద్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పిజ్జా3’ తమిళనాట అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్న కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ ఆగష్టు 18 న తెలుగులో’పిజ్జా3’ని గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

హీరో అశ్విన్ కాకుమణి మాట్లాడుతూ.. ‘పిజ్జా3’ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్. చాలా ఇంట్రెస్టింగా వుంటుంది. ఈ కథని బలంగా నమ్మి టీం అంతా కష్టపడిపని చేశాం. ఈ సినిమాని ఫ్యామిలీతో కలసి థియేటర్లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు మంచి కంటెంట్ ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకం వుంది. ఈ సినిమాని తెలుగు విడుదల చేస్తున్న మురళి, ఆశిష్ గారికి థాంక్స్. అందరూ తప్పకుండా థియేటర్ లో పిజ్జా 3 చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

పవిత్ర మాట్లాడుతూ.. ఇది నా మొదటి తెలుగు రిలీజ్. చాలా ఆనందంగా వుంది. సినిమా మీ అందరినీ అలరిస్తుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంజాయ్ చేయండి’’ అన్నారు.

మోహన్ గోవింద్ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. తెలుగులో విడుదల కావడం అనందంగా వుంది. ‘పిజ్జా3 ప్యూర్ హారర్ మూవీ. బలమైన కంటెంట్ ఎమోషన్ వుంటాయి. మీ అందరి ప్రోత్సాహంతో పెద్ద బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటున్నాను.

ఆశిష్ వేమిశెట్టి మాట్లాడుతూ.. సినిమా చాలా గ్రిపింగ్ గా వుంటుంది . సినిమాలో చాలా థ్రిల్లింగ్ మూమెంట్స్ వుంటాయి . బీజీఎం, కెమరా వర్క్ హైలెట్ గా వుంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా వుంటాయి. గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇంటర్వెల్ బాంగ్ లో ఎక్స్ టార్డినరిగా వుంటుంది. అశ్విన్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మురళిధర్ గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. డిస్ట్రిబ్యుషన్ ప్రొడ్యుసర్ గా ఇది నా మొదటి సినిమా. మీ అందరి ప్రోత్సాహం కావాలి’’ అని కోరారు.

Also Read:మోడీకి పోటీగా ప్రియాంక గాంధీ?

- Advertisement -