ఫోన్ హ్యాకింగ్‌పై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

40
- Advertisement -

విపక్ష నేతల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విపక్ష నేతల ఆరోపణలను ఖండించిన ఆయన వారిని ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చంటూ తెలిపారు. విపక్ష నేతలను ఎవరో ప్రాంక్‌ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నా దానిపై వారు ఫిర్యాదు చేయాలన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

విపక్ష ఎంపీలు తమ ఫోన్లు హ్యాకింగ్‌కు గురయ్యాయని ఆరోపించడం తీవ్ర కలకలం రేగింది. తృణ‌మూల్ ఎంపీ మ‌హువా మొయిత్రా, కాంగ్రెస్ నేతలు ప్రియాంకా చ‌తుర్వేది, శ‌శి థ‌రూర్‌, ప‌వ‌న్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘ‌వ చ‌ద్దా, ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ త‌మ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు. ఫోన్ కంపెనీల నుంచి త‌మ‌కు వార్నింగ్ మెసేజ్‌లు వ‌చ్చిన‌ట్లు వారు పేర్కొన్నారు.దీంతో కేంద్రం తీరుపై విపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర స్ధాయిలో మండిపడగా దీనిపై తనదైన శైలీలో స్పందించారు పీయూష్ గోయల్.

Also Read:KCR:సత్తుపల్లిలో 80 వేల మెజార్టీతో గెలుస్తాం

- Advertisement -