మోదీ హయాంలో వికసిత్ భారత్ దిశగా దూసుకెళ్తున్నాం అన్నారు కేంద్రమంత్రి పీయుష్ గోయల్. పెట్టుబడులు తెచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారు అన్నారు. ఏపీ ఎగుమతులు, దిగుమతులకు విశాఖ గేట్ వే. స్వర్ణాంద్ర కావాలన్న చంద్రబాబు స్వప్నం సాకారం కావాలి అన్నారు.
వసుదైక కుటుంబం, మానవతా విలువలను భారత్ ఎప్పటీకీ మరిచిపోదు… సాంకేతికత ద్వారా అభివృద్ధి వైపు అడుగులు వేస్తాం అన్నారు. ప్రతి పనిలో పర్యావరణ పరిరక్షణ గురించి ఆలోచిస్తాం… భాగస్వామ్యం, పరస్పర అబ్ధి ద్వారానే వేగంగా అభివృద్ధి సాధ్యం అన్నారు.
సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రసంగించారు మంత్రి నారా లోకేష్. దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ, ఏపీకి గ్రోత్ కారిడార్‌గా విశాఖ తయారవుతున్నాయి…అమరావతి నిర్మాణం, విశాఖ అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేగంగా చేస్తున్నారు అన్నారు. ఏపీకి వచ్చే పెట్టుబడులకు అనుమతులు, భూములు కేటాయించి త్వరితగతిన ఉత్పత్తి దశకు చేరుకునేలా చేయూత ఇస్తున్నాం…ఏపీలో, కేంద్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్లు ఉన్నాయి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడితే వాటిని ప్రభుత్వ పెట్టుబడులుగా భావించి వారందరికీ అండగా నిలుస్తున్నాం…2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి కేంద్ర మంత్రి పీయుష్ గోయెల్ సహకరిస్తున్నారు అన్నారు.
Also Read:మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ ఆధిక్యం

