త్వరలో విమాన రెస్టారెంట్‌@హైదరాబాద్‌

163
- Advertisement -

మనం రెస్టారెంట్‌ వెళ్లి కాసేపు వేయిట్ చేసి టీఫిన్స్ భోజనం డిన్నర్ చేస్తాము. కానీ విమానంలో భోజనం చేయాలంటే ఖచ్చితంగా విమానం ఎక్కాల్సిందే. ఇందుకు అనుగుణంగా మనం అంత ఖర్చు కూడా చేయలేము అలాంటి వారి కోసం పిస్తా హౌస్ ఒక విన్నూత్నమైన ప్రయోగం చేసింది. ఏకంగా ఓ విమానాన్ని కొని అందులో రెస్టారెంట్ ఉండే విధంగా అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నారు. ఇది ఎక్కడంటే తెలుసా…మన హైదరాబాద్‌. హైదరాబాద్ అంటే బిర్యాన్నీ హాలీమ్ పత్తర్ కా ఘోష్ లాంటి విభిన్నమైన ఫుడ్‌తో పాటు వేజిటెరియన్ కూడా లభిస్తుంది. ఆవునండి…ఇది నిజం. కేరళలో ఓ పాత విమానంను వేలం వేయగా పిస్తా హౌస్ దాన్ని కొనుగోలు చేసి అచ్చం 150మంది కూర్చునే వీలుగా ఓ రెస్టారెంట్‌గా మారుస్తున్నారు.

విమానం రెస్టారెంట్‌ను త్వరలో హైదరాబాద్‌ నగర శివార్లలోని శామీర్‌పేటలో ఫ్లైట్ రెస్టారెంట్‌గా ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్‌పోర్ట్‌ను తలపించేలా పరిసరాలను మార్చేస్తోంది. రన్ వే, సెక్యూరిటీ చెక్, బోర్డింగ్ పాస్ స్టైల్లో టికెట్లు తదితర ఏర్పాట్లను చేసింది. విమానంలో 150 సీట్లను ఏర్పాటు చేశారు. ఎంచెక్కా విమానంలో కూర్చొని.. అటు శామీర్ పేట చెరువు అందాలను తనివి తీరా ఆస్వాదిస్తూ..ఇటు పిస్తా హౌస్ రుచులను ఆస్వాదించే మధురానుభూతిని అందించనుంది. రుచికరమైన వంటకాలతో పాటు అత్యాధునిక సదుపాయాలతో ఈ ఫ్లైట్ రెస్టారెంట్ ను తీర్చిదిద్దనుంది పిస్తా హౌస్ యాజమాన్యం.

ఈ విమానం రెస్టారెంట్ డిసెంబర్‌ లేదా 2023 జనవరికల్లా అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైట్‌ రెస్టారెంట్ హైదరాబాద్‌లో మొట్టమొదటిదే కావటం విశేషం. కానీ భారత్ లో ఇటువంటివి విమానం రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. పాట్నాలోని హాజీపూర్, హర్యానాలోని గుర్గావ్, గుజరాత్‌లోని వడోదర వంటి నగరాల్లో ఇప్పటికే విమానం రెస్టారెంట్‌లు ఆహార ప్రియుల్ని అలరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

టిఫా స్కానింగ్‌తో ఆరోగ్య తెలంగాణ

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…

అభివృద్ధి చేసి చూపించండి..బీజేపీకి గుత్తా సవాల్

- Advertisement -