నేను బాలీవుడ్ కి ఎందుకు వెళ్ళాలి ? వెళ్లను !

128
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్ రేంజ్.. బాలీవుడ్ స్టార్ హీరోలకన్నా ఎక్కువ అని ఆయన ఫ్యాన్స్ మురిపంగా చెప్పుకుంటారు. కానీ, విజయ్ మాత్రం బాలీవుడ్ వైపే చూడలేదు. మరోపక్క, సౌత్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మరి మీ ఎంట్రీ ఎప్పుడు అని తమిళ మీడియా విజయ్ ను ప్రశ్నించింది. ఐతే, తన బాలీవుడ్ ఎంట్రీ పై విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మీ విజయ్ కి ప్రత్యేకంగా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ?’, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సౌత్ సినిమాలను చూస్తున్నారు కదా. సౌత్ చిత్రాలకు నార్త్ లో దక్కుతున్న ఆదరణ చాలదా ?, నా సినిమాలలో కొన్ని హిందీలో డబ్ అయ్యి అక్కడ ప్రేక్షకులను అలరించాయి. అలాగే భవిష్యత్తులోనూ అలరిస్తాయి’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.

అదే విధంగా విజయ్ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజానికి నాకు బాలీవుడ్‌ లో ఎప్పటి నుంచో ఆఫర్స్‌ వస్తూనే ఉన్నాయి. కానీ, (అని సరదాగా నవ్వుతూ..) వాళ్లు నాకు సెట్ అవ్వరు. అయినా తమిళ చిత్రసీమలో నాకు లభిస్తోన్న ప్రేమాభిమానాలు అద్భుతమైనవి. అలాంటప్పుడు నేను వాటిని వదిలి వేరే పరిశ్రమకు ఎందుకు వెళ్లాలి ?, అందుకే.. బాలీవుడ్ కి వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. ఎందుకంటే తమిళ సినిమాలే నా బలం’ అని విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక వారసుడు సినిమా పై కూడా విజయ్ కామెంట్స్ చేశారు. వారసుడు సినిమాతో సూపర్ హిట్ కొట్టబోతున్నాం అని అన్నారు. దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సంక్రాంతి కి రాబోతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను విజయ్ ‘వారసుడు’ అందుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి…

యంగ్ డైరెక్టర్ పై లెజెండరీ దర్శకుడు ప్రశంసలు !

మట్టి కుస్తీ మాస్ కమర్షియల్:విష్ణువిశాల్

ఆశ్చర్యపరుస్తున్న కన్నడ హీరోలు.. వారంతా రియల్లీ గ్రేట్ !

- Advertisement -