కంటెంట్‌ని నమ్ముకొని తీసిన చిత్రం..’పిండం’

5
- Advertisement -

ప్రముఖ హీరో శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం‘. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇటీవల మేకర్స్ ‘పిండం’ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి టీజర్ విడుదలైంది. ఈరోజు(అక్టోబర్ 30) ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు శ్రీరామ్ మాట్లాడుతూ, “దీనికి ముందు నాలుగు సినిమాలు స్టార్ట్ చేశాం. అవన్నీ ఇంకా పూర్తి కాలేదు. కానీ రెండే నెలల్లో ఈ సినిమా పూర్తయింది. కరెక్ట్ గా మొదలై, కరెక్ట్ గా పూర్తయింది. మన మనస్సు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. ఇంత మంచి నిర్మాతలను నా జీవితంలో చూడలేదు. మా డైరెక్టర్ సాయి కిరణ్ గారు చాలా క్లారిటీ ఉన్న మనిషి. ఏం కావాలో స్పష్టంగా తెలుసు. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తయిందో తెలియనంతగా షూటింగ్ సరదాగా సాగిపోయింది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు పిల్లలు రియల్ సూపర్ స్టార్స్. ఒక నటుడిగా వాళ్ళ నటన చూసి నేనే ఆశ్చర్యపోయాను. నటీనటులు గానీ, సాంకేతిక నిపుణులు గానీ ఈ టీమ్ అందరితో కలిసి పని చేయడం సంతోషంగా ఉంది. ది స్కేరియస్ట్ ఫిల్మ్ అని చెప్పడం వల్ల భయపడి సినిమాకి రాకుండా ఉండకండి. ఏంటి మమ్మల్ని భయపడతారా అనుకొని సినిమాకి రండి. ఖచ్చితంగా సినిమా మిమ్మల్ని అలరిస్తుంది. అనవసరమైన పాటలు, రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉండవు. కంటెంట్ ని నమ్ముకొని తీసిన చిత్రమిది. ఇలాంటి మంచి టీమ్ గెలవాలి. ఇలాంటి మంచి సినిమాని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

Also Read:KCR:ప్రజాసేవ చేస్తే..దాడులు చేస్తారా?

ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ, “సినిమా తీయడానికే భయపడుతున్న ఈ రోజుల్లో భయపెట్టే సినిమా తీశాడు సాయి. ముందుగా దానికి మెచ్చుకోవాలి. సాయి ఎంతో ప్రతిభావంతుడు. ఐటీ జాబ్ చేస్తూ, సినిమా మీద ఇష్టంతో ఇక్కడికి వచ్చాడు. 2020 లో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మా బ్యానర్ లోనే దర్శకుడిగా పరిచయం కావాల్సి ఉంది. అది అమెరికాలో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా, కోవిడ్ కారణంగా వీసాలు రాలేదు. ఆ తర్వాత సిద్ధు డీజే టిల్లు తో బిజీ అయ్యాడు. ఇంతలో సాయి ఈ సినిమా చేసుకొని వస్తా అన్నాడు. ఇలాంటి ప్రతిభావంతులు పరిశ్రమకి కావాలి. అప్పుడే వైవిధ్యమైన సినిమాలు వస్తాయి. పిండం అనేది జననానికి, మరణానికి సంబంధించినది. ఈ పిండం సాయి కిరణ్ లాంటి ప్రతిభగల దర్శకుడి పుట్టుకకు కారణం అవ్వాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ టాలెంట్ త్వరలో ప్రపంచం చూడబోతుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.” అన్నారు.

- Advertisement -