వైసీపీకి వార్నింగ్..సీట్ ఇవ్వకపోతే అంతే!

44
- Advertisement -

ఏపీలో అధికార వైసీపీలో గత కొన్నిరోజులుగా వర్గపోరు కొనసాగుతోంది. కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం నియోజికవర్గం సీటు విషయమై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మరియు రాజ్యసభ సబ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోష్ మద్య గత కొన్నిరోజులుగా రాజకీయ రగడ కొనసాగుతోంది. సీటు విషయంలో ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో ఈ వివాదం పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే రామచంద్రపురం నియోజిక వర్గ సీటు కేటాయింపు చెల్లుబోయిన వేణుగోపాల్ కే ఎక్కువ అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

దీంతో పిల్లి శుభాష్ చంద్రబోస్ పార్టీని వీడే అవకాశం ఉందని గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వార్తలను నిజం చేసేలా తాజాగా పిల్లి శుభాష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తనకు సీటు ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఆయన పార్టీ వీడడం ఖాయమే అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కాగా పిల్లి శుభాస్ మరియు చెల్లుబోయిన వేణు మద్య సయోద్య కుదిరించేందుకు జగన్ ప్రయత్నించిన పెద్దగా ఫలించినట్లు లేదు. వేణు ఒక క్యారెక్టర్ లేని వ్యక్తి అని అతనితో సమావేశం అయ్యేందుకు తాను సిద్దంగా లేనంటూ పిల్లి శుభాష్ చెప్పుకొచ్చారు.

Also Read:Kanguva:క్రేజీ అప్‌డేట్

కాగా రామచంద్రపురం నియోజిక వర్గ సీటు తనదే అని చెల్లుబోయిన వేణుగోపాల్ ఇప్పటికే ప్రకటించారు. జగన్ కూడా చెల్లుబోయిన వేణుకే సీటు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వేణుకి సీటు ఇస్తే పిల్లి శుభాష్ పార్టీని వీడడం ఖాయం. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెబుతున్నప్పటికి ఎన్నికల సమయానికి ఏదో ఒక పార్టీ గూటికి చేరిన ఆశ్చర్యం లేదు. అదే గనుక జరిగితే రామచంద్రపురం నియోజిక వర్గంలో వైసీపీ గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉంది. మరి పార్టీలో ఈ వర్గపోరుకు జగన్ చెక్ పెడతారా ? లేదా సైలెంట్ గా వ్యవహరిస్తారా అనేది చూడాలి.

Also Read:బ్రోకి నో కట్స్..అండ్ రన్ టైమ్ అదే!

- Advertisement -