ఆర్ఆర్ఆర్‌ పై హైకోర్టులో పిల్..!

103
rrr
- Advertisement -

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్‌కు మరో షాక్ తగిలింది. జనవరి 7న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదాపడిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య్ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల పాత్రలతో ఫిక్షనల్ గా ఈ సినిమాను రూపొందించారు రాజమౌళి. 1920నాటి పరిస్థితుల్ని ఈ సినిమాతో కళ్ళకు కట్టబోతున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ వంటి చారిత్రక పురుషుల కథను వక్రీకరిస్తున్నారటూ రాజమౌళిపై పలు విమర్శలు వస్తున్నాయి.

కాగా ఇది హిస్టారికల్ మూవీ కాదని…అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల పాత్రలను మాత్రమే తీసుకుని… వారిద్దరూ స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టకముందు అజ్ఞాతంలో ఉన్నారని, ఆ టైమ్‌లో వాళ్లు ఏం చేశారనేది ఎవరికి తెలియదని, చరిత్రలో కూడా దాని గురించి చెప్పలేదని, దాన్ని బేస్ చేసుకుని అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఆ ఇద్దరు వీరులు ఏం చేశారనే దానిపై రాసుకున్న ఫిక్షనల్ స్టోరీ అని రాజమౌళి మొదటి నుంచి క్లారిటీ ఇస్తున్నారు. అయితే అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న చరణ్ బ్రిటీష్ సైన్యంలో అధికారిగా పని చేస్తున్నట్లు ట్రైలర్‌తో చూపడంపై, అలాగే కొమురం పాత్రధారి ఎన్టీఆర్ తలపై ముస్లింలు వాడే టోపీ పెట్టుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా వాయిదా వేయాల్సి రావడంతో తలపట్టుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌కు మరో ఝలక్ తగిలింది. ట్రిపుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం చరిత్రను వక్రీకరించారని ప.గో.జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్ట్ లో పిల్ వేశారు. ఈ సినిమాకు సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని, అలాగే విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు పిటీషనర్ కోరారు.

- Advertisement -