పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం..సుప్రీంలో పిటిషన్

79
- Advertisement -

నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నూతన పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు న్యాయవాది సీఆర్ జయ సుకిన్.లోక్‌సభ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. అయితే పలు పార్టీలు మాత్రం హాజరవుతామని చెప్పగా ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read:విపక్షాల మూకుమ్మడి ప్లాన్ !

మే 28న నూతన పార్లమెంట్‌ భవనం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు లోక్‌సభ సెక్రేటరియట్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. నూతన పార్లమెంట్‌ భవనంలో 888 మంది ఎంపీలు రాజ్య సభలో 300 మంది రాజ్యసభ సభ్యులు కూర్చునే విధంగా సదుపాయాలు ఉండనున్నాయి.

- Advertisement -