‘పిచ్చిగా నచ్చావ్‌’ సక్సెస్‌ మీట్‌…

216
- Advertisement -

సంజీవ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘పిచ్చిగా నచ్చావ్‌’. వి.శశిభూషణ్‌ దర్శత్వంలో కమల్‌కుమార్‌ పెండెం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.

అనుకున్నది రీచ్‌ అయ్యాం: కమల్‌కుమార్‌

కథ విన్నప్పుడు నేను ఏదైతే నమ్మానో అది నిజమైంది. కథ, స్క్రీన్‌ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చేతన, సంజీవ్‌ క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి. నాగబాబు పాత్ర సినిమాను మలుపు తిప్పింది. తొలి సినిమాతోనే చేతన మంచి మార్కులు తెచ్చుకుంది. అన్ని ఏరియాల నుంచి టాక్‌ బావుంది. చిన్న సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలొస్తాయి.

PIchiga Nachav Movie Successmeet

పిచ్చిపిచ్చిగా నచ్చింది: చేతన

”పిచ్చిగా నచ్చావ్‌ హీరోయిన్‌గా నాకొక ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. ప్రజెంట్‌ జనరేషన్‌ కెరీర్‌ పట్ల, ప్రేమ పట్ల ఎలాంటి ఆలోచనలతో ఉంటున్నారు అన్నది ఇందులో చెప్పాం. యువతకు పిచ్చిపిచ్చిగా నచ్చింది. హీరోయిన్‌గా నాకు మంచి లాంచ్‌ ఇది”.

అదే కారణం: దర్శకుడు శశి భూషణ్‌

రియలిస్టిక్‌ కథతో తెరకెక్కించిన చిత్రమిది. ఇటువంటి కథకు కొత్త నటీనటులే న్యాయం చేయగలరని అంతా కొత్తవారిని తీసుకున్నాం. కామెడీ, పాటలు, సందేశం ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఇందులో ప్రతి పాత్ర మన మధ్య కనిపించేదే. అదే సినిమా జనాల్లోకి వెళ్లడానికి కారణం.

ఇంకా ఈ కార్యక్రమంలో పుచ్చా రామకృష్ణ, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: వెంకట హనుమ, సంగీతం: రాం నారాయణ, ఆర్ట్‌: రమేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: పుచ్చా రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి శైలజ.

- Advertisement -