ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్‌ ప్రైజ్‌

180
- Advertisement -

2022వ సంవత్సరానికిగానూ ఫిజిక్స్‌ విభాగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ ప్రైజ్‌ను ప్రకటించారు. ఫిజిక్స్‌ విభాగంలో అలెన్‌ యాస్పెక్ట్‌ (ఫ్రాన్స్‌), జాన్‌ ఎఫ్‌.క్లాజర్‌( అమెరికా), యాంటోన్‌ జీలింగర్‌(ఆస్ట్రియా)లను నోబెల్‌ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదిగాను ఫిజిక్స్‌లో ఫోటాన్ల లో చిక్కుముడులు, బెల్‌ సిద్ధాంతంలో అసమానతలు, క్వాంటమ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌లో పరిశోధనలు జరిపి కొంగొత్త విషయాలను గుర్తించినందుకుగానూ వారిని నోబెల్‌ కు ఎంపిక చేసినట్టు తెలిపింది.

ఇప్పటికే వైద్య బౌతిక శాస్త్రాల్లో ఈ అవార్డులను ప్రకటించారు. బుధవారం రసాయన, గురువారం సాహిత్య రంగాల్లో విజేతల పేర్లను ప్రకటించనున్నారు. శాంతి బహుమతి విజేతను శుక్రవారం, అక్టోబరు10న ఆర్థిక రంగంలో నోబెల్‌ విజేత పేరును వెల్లడిస్తారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందిస్తారు. వీటిని ఈ ఏడాది డిసెంబర్ 10న అవార్డు గ్రహీతలకు అందిస్తారు.

- Advertisement -