చాలమంది రాత్రిపూట మొబైల్ చార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. ఇలా పెట్టడం మంచిదేనా కదా అనే విషయలపై కనీసపు అవగాహన కూడా లేకుండా ఈ విధంగా చేస్తుంటారు. ఇలా చేయడానికి కూడా కారణం లేకపోలేదు. సాధారణంగా మొబైల్ బ్యాటరీ ఫుల్ చార్జ్ కావడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇప్పుడు చాలా మొబైల్స్ కు ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది కానీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లేని మొబైల్స్ కు ఆ మాత్రం సమయం పడుతుంది. అందువల్ల పగటిపూట మొబైల్ చార్జింగ్ కు అంతా సమయం కేటాయించడానికి వీలు పడదు.
ఎందుకంటే మనం చేరే పనుల కారణంగా తరచూ మొబైల్ వాడుతూనే ఉంటాం. కాబట్టి కొద్దిసేపు చార్జింగ్ పెట్టి అప్పటికప్పుడు మొబైల్ యూస్ చేస్తుంటాము. అందువల్ల చాలమంది రాత్రిపూట పడుకునే ముందు మొబైల్ చార్జింగ్ పెట్టి మళ్ళీ ఉదయం లేచిన తరువాత తీస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల మొబైల్ ఫుల్ చార్జ్ అయినప్పటికి చాలా సమస్యలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. రాత్రంత మొబైల్ చార్జింగ్ పెట్టడం వల్ల అందులోని ఉండే లిథియం బ్యాటరీ రసాయనక చర్యకు లోనై వేడిగా మారుతుంది.
కొన్ని సంబర్భాల్లో మొబైల్ పేలిపోయిన ఆశ్చర్యం లేదు. ఇక ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ కెపాసిటీ కూడా తగ్గుతుంది. దాని వల్ల బ్యాటరీ లైఫ్ త్వరగా తగ్గిపోతుంది. ఐతే ప్రస్తుతం అప్ డెటెడ్ గా ఉన్న మొబైల్స్ 100శాతం చార్జింగ్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా చార్జ్ చేసుకోవడాన్ని ఆపేస్తాయి. కానీ వంద శాతం చార్జ్ కంప్లీట్ అయిన తరువాత కూడా అలాగే ఉంచడం వల్ల మొబైల్ లోని సున్నితమైన కాంపొనెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ ఫుల్ చార్జ్ అయిన వెంటనే పవర్ బొర్ట్ నుంచి మొబైల్ కు పవర్ సప్లై ఆపేయడం చాలా మంచిదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read:Ravi Teja:టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్