తేజుతో నాని ‘చిత్రలహరి’..

210
Sai Dharam tej
- Advertisement -

నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు ఓకే చేస్తూ బిజీ గా ఉన్నాడు. నాని హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘చిత్రలహరి’ అనే చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందుకోసం కిషోర్‌ తిరుమల స్క్రిప్ట్‌ సిద్దం చేస్తున్నాడని, నాని డేట్లు కూడా ఇచ్చాడని, త్వరలో పట్టాలెక్కబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.

కాని తాజాగా ఆ ప్రాజెక్ట్‌ నుండి నాని తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి నాని ఒక చిత్రం చేస్తున్నాడు. దాంతో పాటు మరో రెండు పెద్ద చిత్రాలకు నాని కమిట్‌ అయ్యాడు. అందుకే ఈ చిత్రాన్ని నాని లైట్‌ తీసుకున్నట్లుగా సమాచారం . దానికి తోడు కిషోర్‌ తిరుమల తీసుకు వచ్చిన ఫైనల్‌ స్క్రిప్ట్‌ కూడా నానిని తృప్తి పర్చలేదు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Sai Dharam tej

అయితే ఫస్టాఫ్ చాలా బాగుందని చెప్పిన నాని, సెకండాఫ్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మార్పులు చేర్పులు చేయడానికి కిషోర్ తిరుమల ప్రయత్నించినా నానిలో ఆ అసంతృప్తి అలా ఉండిపోయింది. దాంతో ఆ కథ సాయిధరమ్ తేజ్ దగ్గరికి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కథకి సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడనేది తాజా సమాచారం.

ఈ కథ నచ్చిందని సాయిధరమ్ తేజ్ చెప్పడంతో, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లడానికి కిషోర్ తిరుమల సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలోను సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఆయన తాజా చిత్రంగా ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

- Advertisement -