ఆన్ లైన్‌లో పీఎఫ్‌ విత్ డ్రా…

313
PF Withdrawal Claim Online
- Advertisement -

పీఎఫ్ ఖాతాదారులకు ఓ శుభవార్త. ఇకమీదట ఉద్యోగులు ఉద్యోగాలు మారినప్పుడల్లా పిఎఫ్ ఖాతా కూడా ఆటోమేటిక్ గా బదిలీ అవడమే కాదు నేరుగా ఆన్‌ లైన్ నుంచి విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం. దీంతో ఉద్యోగం మానేసినా…మరో ఉద్యోగంలో చేరినా, పీఎఫ్ విత్ డ్రా చేసుకోవాలన్న  ఇక అప్లికేష‌న్ ప‌ట్టుకుని మాతృ సంస్థ‌ల చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేదు.

యాజ‌మాన్యం దృవీక‌ర‌ణ లేకుండా నేరుగా ఆన్‌లైన్ క్లైమ్ చేసుకుని అవ‌స‌ర‌మైన సేవ‌లు పొందేలా ఈపీఎఫ్‌వో నూత‌న వెబ్‌సైట్‌ను రూపొందించింది. http://unifiedportalmem.epfindia.gov.in/memberinterface/ను రూపొందించింది. ప్ర‌స్తుతం ద‌ర‌ఖాస్తు చేసుక‌నేందుకు, ఈపీఎఫ్ కార్యాల‌యంలో స‌మ‌ర్పించేందుకు క‌నీసం వారం నుంచి ప‌ది రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఇక నుంచి ఆ బాధ ఉండ‌దు. ఆన్‌లైన్ సేవ‌ల‌తో స‌త్వ‌ర ఫ‌లితం ఉంటుంది.

ఈ సేవ‌లు ప్రాంతీయ కార్యాల‌యాల్లో ప్రారంభ‌మ‌య్యాయి. దీనికి బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు అనుసంధానం త‌ప్పని స‌రి. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు స‌మ‌ర్పించ‌న వెంట‌నే సంబంధిత అధికారి డాష్‌బోర్డ‌కువెళుతుంది. అక్క‌డ ఆమోదం పొందిన వెంట‌నే బ్యాంకు ఖాతాలో న‌గ‌దు జ‌మ అవుతుంది. కేవైసీ కింద బ్యాంకు ఖాతా, పాన్ నెంబ‌ర్‌, ఆధార్‌కార్డు త‌ప్పినిస‌రి. గ‌తంలో యూఏఎన్ పోర్ట‌ల్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌వారు ఆ వివ‌రాల‌తో వెబ్‌సైట్‌లో లాగిన్ కావ‌చ్చు.

- Advertisement -